పాట్నా: రాష్ట్రపతి ఎన్నికలో బిజెపి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కే మద్దతు ఇవ్వాలని జనతా దళ్(యునైటెడ్) నిర్ణయించింది. బుధవారం ఇక్కడ ఆ పార్టీ కోర్‌కమిటీ సమావేశం అనంతరం ఆ పార్టీ శాసన సభ్యుడు ఒకరు మీడియాతో మాట్లాడారు. 'మేము పార్టీ సమావేశం నిర్వహించుకున్నాం. రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్రపతి పదవికి ఆయన తగిన అభ్యర్థి' అని సోబర్సా ఎమ్మెల్యే రతేష్ సదా చెప్పారు. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి నితీష్‌కుమార్ విడిగా సమావేశం ఏర్పాటు చేశారన్నారు.
ఈ సమావేశానికి పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు హాజరయ్యారన్నారు. కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల నితీష్‌కుమార్ వ్యక్తిగతంగా హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. అయితే జెడి(యు) మిత్రపక్షం ఆర్‌జెడి ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై ఈ నెల 22న ఇతర పక్షాలతో కలిసి తుది నిర్ణయం తీసుకోనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ అజాద్ మంగళవారం రాష్ట్రీయ జనతాదళ్ ముఖ్యనేత లాలు ప్రసాద్ యాదవ్, జెడి(యు) నేత బీహార్ ముఖ్యమంతి నితీష్‌కుమార్‌తో సమావేశం అయిన సంగతి తెలిసిందే.జాదవ్ కేసును పునరాలోచించే అవకాశాలు..
రాష్ట్రపతి పదవికి ఎన్‌డిఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇవ్వాలని జనతాదళ్-యునైటెడ్ (జెడియు) నిర్ణయించింది. మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి నిర్ణయంతో సంబంధం లేకుండా జెడియు తన నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రపతి పదవికి నామినేట్ అయిన తొలి బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ అని, తమ పార్టీ నేతలందరూ ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారని జెడియు నేత రత్నేష్ సదా చెప్పారు....
Comments
Post a Comment